ప్రభుత్వ కాలేజీలు: 14
అందుబాటులోని కోర్సులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ
ఈసారి కొత్త కోర్సులు: ఏసీఈ
వొకేషనల్ కోర్సులు(పెద్దపల్లి– బాలుర), గోదావరిఖని: ఓఏ, ఎంఎల్‌టీ, ఎంసీహెచ్‌డబ్ల్యూ, సీఎస్సీ, ఐఅండ్‌ఎం, సీజీఏ, ఏఅండ్‌టీ, ఏఈటీ, టీఅండ్‌హెచ్‌ఎం, సీటీ
పెద్దపల్లిరూరల్: పక్కా భవనాలు.. సుశిక్షితులైన అధ్యాపకులు.. ఆధునిక సాంకేతికతతో కూడిన ల్యాబ్‌లు.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న కొత్త కోర్సులు.. డిజిటల్ ఫార్మాట్‌లో విద్యాబోధన.. రికార్డుస్థాయిలో ఉత్తీర్ణత.. ఇవన్నీ ఉచితంగానే అందిస్తున్నాయి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు.
అధ్యాపకుల ప్రచారం..
ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. టెన్త్ పాసైన విద్యార్థుల వివరాలు సేకరించి వారి ఇళ్లకు వెళ్తూ సర్కారు కాలేజీల్లోనే చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం అవగాహన ర్యాలీ లు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇంటర్ కాలేజీలు ఇప్పటికే తెరచుకున్నాయి. విద్యార్థుల ప్రవేశాలూ ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 14 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.
ఉపాధినిచ్చే ఒకేషనల్ కోర్సులు..
ఉపాధి అవకాశాల కోసం విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సులు అందుబాటులో ఉన్నాయి. పెద్దపల్లిలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కాలేజీల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అలాగే గోదావరిఖనిలోని బాలుర, బాలికల కాలేజీలు, మంథనిలోని బాలుర కాలేజీ, జూలపల్లి, సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ విద్యార్థుల ప్రవేశాలు జోరుగా జరుగుతున్నాయి.
అందుబాటులో ప్రభుత్వ హాస్టళ్లు
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం పెద్దపల్లిలో బీసీ, ఎస్సీ ప్రభుత్వ హాస్టళ్లు అందుబాటు లో ఉన్నాయి. బాలికలకు ప్రత్యేక వసతి గృహాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాలేజీల్లో చదువుకుని ప్రభుత్వ హాస్టల్‌లో వసతి పొందే వీలుంది. వీటిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
డిజిటల్ విద్యా బోధన
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిజిటల్ పద్ధతిన విద్యాబోధన చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీకాలేజీకి రూ.2లక్షల వరకు ఖర్చు చేసిన సర్కార్.. డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసింది. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసుకునేందుకూ అవకాశం ఉంది.
సర్కారు కాలేజీలో చేరితే ఇలా..
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరే ప్రతీవిద్యార్థికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు. అర్హులైన వారికి ఉపకారవేతనాలు మంజూరు చేస్తున్నా రు. ఫస్టియర్ నుంచే ప్రయోగ పరీక్షలు నిర్వహి స్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నారు.
విద్యార్థికో కిట్
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతీ విద్యార్థి కాలేజీ వెళ్లేందుకు సిద్ధం చేసిన కిట్ అందిస్తున్నారు. అందులో 12 నోటుపుస్తకాలు, బ్యాగు, ఐడీ కార్డు, రెండు జతల యూనిఫామ్, ఒకజత షూ, సాక్సులు, బాలురకు బెల్ట్ ఉండేలా కిట్ రూపొందించారు.
జిల్లా సమాచారం
సర్కారు అధ్యాపకుల ప్రచారం
ప్రభుత్వ కాలేజీల్లో డిజిటల్ బోధన
అందుబాటలో ఆధునిక వసతులతో కూడిన హాస్టళ్లు
విద్యార్థులకు సకల సౌకర్యాలు
తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న లెక్చరర్లు
గతేడాది ఇంటర్‌లో చేరిన విద్యార్థుల సంఖ్య
ఫస్టియర్ 3,826 వొకేషనల్ 1,068
సెకండియర్ 4,550 వొకేషనల్ 1,086


