గోదావరిఖని: యువత మత్తు వీడేలా పోలీసుశాఖ ప్రత్యేక వ్యూహాలను రూపొందిస్తోంది. డ్రగ్స్‌ను పూర్తిస్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పెద్దపల్లి, మంచిర్యాల రెండు జిల్లాల డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, స్టేషన్‌హౌస్ ఆఫీసర్ల వరకు డ్రగ్స్ నియంత్రణకు కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గంజా యి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, కొ నుగోలు చేసినా, నిల్వ ఉంచినా కఠిన చట్టాలు అ మలు చేస్తామని పోలీసుశాఖ హెచ్చరిస్తోంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే కమిషనరేట్‌లో ఒక సీఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో రెండు యాంటీ నార్కోటిక్ బృందాలు పనిచేస్తుండగా, వాటికి అదనంగా సర్కిల్ స్థాయిలో మళ్లీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల రవాణా మూలాలను గుర్తించడంతోపాటు, సరఫరా, వినియోగంపైనా ఉక్కుపాదం మోపేందుకు సమాయత్తమవుతున్నారు.
పటిష్టమైన ఇన్‌ఫార్మర్ వ్యవస్థ
మావోయిస్టులను తుద ముట్టించేందుకు ఏర్పాటు చేసిన విధంగానే డ్రగ్స్ నిర్మూలన విషయంలో ప్రత్యేక సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అన్నిప్రాంతాల్లో పోలీసు అధికారులు దృష్టి సారించాలని సూచనలు చేసింది. ముఖ్యంగా సమాచార సేకరణ, అనుమానాస్పద వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా ఉంచడంతోపాటు, సమాచార దాతల వ్యవస్థ (ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్) ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. ఈక్రమంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈబృందాలు ప్రత్యేక దాడులు నిర్వహించనున్నాయి.
ప్రత్యేక బృందాలు
రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. ఇప్పటికే కమిషనరేట్‌లో సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. దీనిని మరింత కఠినతరం చేసేందుకు పోలీస్‌స్టేషన్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇన్‌ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ఠాణాల వారీగా ప్రత్యేక బృందాలు
గంజాయి, డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి


