రామగుండం: భూగర్భంలోని వ్యర్థాలతో ప్రకృతికి హాని కలుగుతుందని, ఉపాధి కూలీలు కందకం తవ్వకంలో వ్యర్థాలను గుర్తించి బయటకు తీసివేయాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సతీశ్‌కుమార్ అన్నారు. కుందనపల్లి, మొగల్‌పహాడ్ గ్రామాల శివారు అటవీ ప్రాంతంలో రెండోరోజు మంగళవారం ఉపాధిహామీ పనుల కూలీలకు వ్యర్థాలపై అవగాహన కల్పించారు. ఫారెస్ట్ అధికారులు కొమురయ్య, తిరుపతి, నర్సయ్య, సయ్యద్ రహ్మతుల్లా, అమీరొద్దీన్, ముస్సాసిర్ షా ఖాన్, స్రవంతి, మాధురి, మేట్ సునంద తదితరులు పాల్గొన్నారు.
ఫీడర్ కాలువ నిర్మాణానికి సర్వే
పెద్దపల్లిరూరల్: నిట్టూరు చెరువులోకి ఎస్సారెస్పీ కాలువ నుంచి ఫీడర్ కెనాల్ నిర్మించేందుకు గల అవకాశాలను ఎస్సారెస్పీ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఇందుకోసం గ్రామస్తులు అవసరమైన స్థలాన్ని సమకూర్చుకున్నారు. అవసరమైన నిధులు కేటాయించాలని కలెక్టర్‌ను కలిసి విన్నవించినట్టు స ర్పంచ్ ఆకుల సువర్ణ, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, విండో మాజీ డైరెక్టర్ వేణుగోపాల్‌రావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించామని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఈఈ శ్రీనివాస్ తెలిపారు.
‘ఫార్మర్స్ రిజిస్ట్రీ’తోనే రైతులకు యూరియా
పెద్దపల్లిరూరల్: రైతులు తప్పనిసరిగా ఫా ర్మర్స్ రిజిస్ట్రీ చేయించుకోవాలని, ఇలాంటి వా రికే యూరియా అందుతుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. రైతులు తమ క్లస్టర్ ఏఈవోను కలిసి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆ సమయంలో రైతు నమోదు సంఖ్య వస్తుందని, దానిఆధారంగానే యూరియా యాప్ ద్వారా యూరియా పొందవచ్చని డీఏవో పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
వేధింపులు ఆపండి
జ్యోతినగర్: కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రెండోరోజు మంగళవారం ఎన్టీపీసీ లేబర్‌గేట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పలువురు నాయకులు మాట్లాడు తూ, మెడికల్ టెస్టులు, పోలీస్ వెరిఫికేషన్ పే రిట ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికులను వే ధిస్తోందన్నారు. గత ఒప్పందం ప్రకారం సీనియర్, ఐటీఐ కార్మికులకు ప్రమోషన్లు కల్పించా లని డిమాండ్ చేశారు. నాయకులు చిలుక శంకర్, నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, భూమల్ల చందర్, రామాచారి, సత్యం, ఇజ్జగిరి భూమ య్య, రాజమల్లయ్య, లక్ష్మణ్, సీహెచ్ సత్యం, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


