సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌దే.. | - | Sakshi
Sakshi News home page

సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌దే..

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

కాల్వలశ్రీరాంపూర్‌: పేదలకు సొందింటి కల నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. రైతులు పంట మార్పిడి పద్ధతి పాటిస్తూ, ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని కోరారు. అంతర్జాతీయ కరాటే పోటీల్లో గోల్డ్‌మెడల్‌ సాధించిన ఇప్పలపల్లెకు చెందిన విద్యార్థి వినూత్నను సన్మానించా రు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్‌, తహసీల్దార్‌ రాముడు, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ రవి, సింగిల్‌విండో చైర్మన్‌ చదువు రాంచంద్రారెడ్డి, కాంగ్రె్‌స్‌ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ జెడ్పీటీసీ అంక సదయ్య పాల్గొన్నారు.

రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలి

ఓదెల: రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో గీతకార్మికులు సుభిక్షింగా ఉండాలని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు ఆకాంక్షించారు. గోపరపల్లె గ్రామంలో జరిగిన రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్‌ మద్దెనవేని రవి, ఉపసర్పంచ్‌ గోపు లావణ్య, నాయకు లు అయిలయ్య, పల్లె కనుకయ్య, బైరి రవిగౌడ్‌, తోట రాయలింగు, అనిల్‌, తొట గట్టయ్య, రవి, కాసారపు ఐలయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement