ఆక్రమణల లెక్క.. పైసలిస్తే పక్కా..!
ఓ వైపు..: పార్వతీపురం పట్టణంలోని సర్వే నంబర్ 401లో ఉన్న మెహర్ బాబా మందిర నిర్మాణం అక్రమమని.. నెల్లి చెరువు భూభాగంలో నిర్మాణం చేసినందు వల్ల తక్షణమే కూల్చి వేయాలని మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటీసు ఇదీ.. మూడు రోజుల్లోగా తొలగించకుంటే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరో వైపు..: అదే సర్వే నంబరులో.. ఇదే మెహర్ బాబా మందిర సమీపంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టీడీపీకి చెందిన పట్టణ నాయకుల కనుసన్నల్లోనే కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. మరి వీటికి కూడా నోటీసులు ఇస్తారా.. వాటిపైనా చర్యలు తీసుకుంటారా?
ఆక్రమణల లెక్క.. పైసలిస్తే పక్కా..!


