మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
కూటమి అధికారంలోకి వస్తే ఆడబిడ్డనిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు రూ.1,500లు చొప్పున ఇస్తామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పథకం అమలు కాలేదు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్‌లలో ఆడబిడ్డ నిధి పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణం. అంటే పథకాన్ని అటకెక్కించి మహిళలను మోసంచేశారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ బడ్జెట్‌లో రూపాయి కేటాయించకుండా వారిని మోసం చేశారు. సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు జనానికి సూపర్ మోసం చేశారు.
– దాసరి మాధవనాయుడు,
వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర విభాగం కార్యదర్శి
●
మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


