వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Feb 17 2026 7:23 AM | Updated on Feb 17 2026 7:23 AM

వాతావరణం

వాతావరణం

వాతావరణం ● ముగ్గురు కాంగ్రెస్‌, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌ మాత్రమే హాజరు

ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా ఎక్కువగా నమోదవుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. తెల్ల వారు జామున చల్లగా ఉంటుంది.

ఖానా‘పురం’

ఎన్నిక వాయిదా

ఖానాపూర్‌: ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉత్కంఠంగా సాగుతోంది. ఖానాపూర్‌లో 12 వార్డులు ఉండగా ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. చైర్మన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతోపాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం సోమవారం అధికారులు పోలీసు బందోబస్తు మధ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు గొర్రె తిరుమల, నిమ్మల రమేశ్‌, చిన్నం సత్యంతోపాటు కాంగ్రెస్‌లో చేరిన ఒక స్వతంత్ర కౌన్సిలర్‌ సాజిదా బేగం, ఎక్స్‌ అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ఉదయం 11 గంటలకే మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నియమించిన అధికారి, సీపీవో జీవరత్నం కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించి యోగ్యత పత్రాన్ని అందజేశారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే సుమారు 50 నిమిషాలు అక్కడే ఉన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ సభ్యులు రాకపోవడంతో వెళ్లిపోయారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు మిగతా కౌన్సిలర్లెవరూ రాకపోవడంతో కోరం లేక చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా వేసినట్లు జీవరత్నం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement