హ్యాట్రిక్ కౌన్సిలర్‌కు వైస్ చైర్మన్ పదవి
భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ బీబీ కుతిజా సిద్దిఖా మూడోసారి కౌన్సిలర్‌గా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మొదటి రెండుసా ర్లు ఎంఐఎం నుంచి పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలి చిన ఆమె, ఈసారి 25వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమె భర్త మీర్జా ఇద్రిజ్ బేగ్ ఈసారి తన మద్దతుదారులను 17 చోట్ల బరిలో నిలిపారు. రెండుచోట్ల మాత్రమే విజయం సాధించారు. కీలక పరిణామాల మధ్య బల్దియా పీఠం స్వతంత్రులకు చేజిక్కింది. దీంతో అధికారం దక్కించుకోవడంలో కీలకంగా మారిన బీబీ కుతిజా సిద్దిఖా వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఆమె ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు.


