Puducherry: వ్యాక్సిన్‌ వేసుకుంటేనే జీతం.. తమిళి సై టీకా మెలిక

Vaccination Mandatory In Puducherry  - Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉద్యోగుల జీతాలకు.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ టీకా మెలిక పెట్టారు. కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంటేనే జీతం, దీపావళి రాయితీలు అని గురువారం ప్రకటించారు.

వ్యాక్సిన్‌ ఆవశ్యకతను వివరిస్తూ, అందరూ టీకా వేసుకోవాలన్న నినాదంతో పుదుచ్చేరిలో వైమానిక దళానికి చెందిన సైనికులు గురువారం సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. రాజ్‌ నివాస్‌ ఆవరణలో ఈ ర్యాలీని తమిళి సై సౌందరరాజన్‌ జెండా ఊపి ప్రారంభించారు. 

చెన్నైలో మాస్క్‌ వేటకు 200 బృందాలు 
చెన్నైలో మళ్లీ మాస్క్‌లు ధరించే వారు, భౌతిక దూరం పాటించే వారి సంఖ్య తగ్గింది. దీంతో ప్రత్యేక బృందాల్ని చెన్నై కార్పొరేషన్‌ గురువారం రంగంలోకి దింది. రెండు వందల ప్రత్యేక బృందాలు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా వేయనున్నాయి.

మాస్క్‌లు ధరించని వారి వద్ద నుంచి స్పాట్‌ ఫైన్‌ వసూలు చేయడమే కాకుండా, హెచ్చరించి మరీ మాస్క్‌లు ఇచ్చే పనిలో పడ్డారు. ఇక, చెన్నై వేప్పేరిలోని వ్యవసాయ కళాశాలలో 13 మంది, కోయంబత్తూరులోని నర్సింగ్‌ కళాశాలలో 46 మంది విద్యార్థులు కరోనా బారిన పడడం గమనార్హం.  

చదవండి: యూఎస్‌ నేషనల్‌ సైన్స్‌ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top