మా తప్పును సవరించుకుంటాం.. క్షమించండి: ట్విటర్‌

Twitter Apologises India For Showing Ladakh In China Map - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విటర్‌ తాను చేసిన తప్పిదానికి భారత్‌ను లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరింది. బుధవారం బీజేపీ ఎంపీ మినాక్షి లేఖీ నేతృత్వంలోని జేపీసీ ముందు ట్విటర్‌ ప్రతినిధులు హాజరైన క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా మీనాక్షి లేఖీ మీడియాతో మాట్లాడుతూ.. లడఖ్‌ను చైనా భూభాగంలో చూపించినందుకు ట్విటర్‌ లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరిందని చెప్పారు. భారత పటాన్ని తప్పుగా జియో ట్యాగింగ్‌ చేయడంపై  ట్విటర్‌ ఇండియా మాతృసంస్థ అమెరికా ఐఎన్‌సీ చీఫ్‌ ప్రైవసి ఆఫిసర్‌ డమైన్‌ కరియన్‌ అఫిడవిట్‌ రూపంలో వివరణ ఇచ్చారని తెలిపారు. లడఖ్‌ను చైనా భూభాగంలో చూపించి భారతీయుల మనోభవాలను దెబ్బతీసినందుకు తమ తప్పును ఈ నెల 30వ తేదీ నాటికి సవరించుకుంటామని హామీ ఇచ్చినట్లు మీనాక్షి లేఖీ వెల్లడించారు. (చదవండి: ట్విట్టర్‌పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం)

కాగా ఇటీవల ట్విటర్‌ చైనాకు సంబంధించిన ఓ పోస్టు చేస్తూ లడఖ్‌ను చైనా భుభాగంలో చూపించింది. దీంతో ట్విటర్‌ తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రశ్నించేలా వ్యవహరించిందని పేర్కొంది. అంతేగాక దీనిని దేశ ద్రోహంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ట్విటర్‌ తప్పిదానికి గల కారణాలేంటో ట్విటర్‌ మాతృసంస్థ అమెరికా ఐఎన్‌సీ లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని సంస్థ‌ యాజామన్యాన్ని ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని గట్టి వార్నింగ్‌ ఇవ్వడంతో ట్విటర్‌ దిగోచ్చి క్షమాపణలు చెప్పింది. (చదవండి: ఇన్‌స్టా మొరాయింపు: ‘నేను ఎలా బ్రతకగలను’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top