CoronaVirus: మూడో టీకా ఎక్కడ?

Third Vaccine To Escape Corona Fourth Wave - Sakshi

శివాజీనగర: రానున్న రోజుల్లో కరోనా నాలుగో దాడి నుంచి బయటపడడానికి మూడవ టీకా.. బూస్టర్‌ డోస్‌ తీసుకోవటం అనివార్యం. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బూస్టర్‌ డోస్‌ లభించకపోవడంతో జనం ఆందోళనకు కారణమైంది. బెంగళూరులోని పాలికె ఆసుపత్రుల్లో బూస్టర్‌ డోస్‌ ఉండడం లేదు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మాత్రం కావలసింత టీకా నిల్వలు ఉన్నాయి. బూస్టర్‌ డోస్‌ పేరుతో ప్రైవేట్‌ ఆసుపత్రులు ఎక్కువ ధరను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్థోమత ఉన్నవారు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో టీకా వేసుకొంటున్నారు. అంత డబ్బు పెట్టలేనివారు ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరుగుతూ లేదని చెప్పించుకుంటున్నారు.  

సామాన్యులకు కష్టం  
మరోవైపు మంత్రులేమో ఆస్పత్రుల్లో బూస్టర్‌ టీకా ఉచితంగా వేస్తున్నట్లు రోజూ చెబుతుంటే వాస్తవం మరోలా ఉంది. సామాన్యులు, పేదలు మూడో టీకా కోసం వేచి చూస్తున్నారు. రెండు డోస్‌ల టీకాలను ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం నాలుగో దాడి పొంచి ఉన్న సమయంలో చేతులెత్తేయడం ఏమిటని పలువురు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తక్షణం ఉచిత బూస్టర్‌ డోస్‌ను అందరికీ పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.  

(చదవండి: పరిహారం కోసం సీఎం ఇంటికి పాదయాత్ర..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top