రాహుల్‌ గాంధీ జోడో యాత్రలో పాల్గొనున్న కమల్‌ హాసన్‌

Kamal Haasan Likely To Join Bharat Jodo Yatra In Delhi - Sakshi

న్యూఢిల్లీ: రాజకీయవేత్త తమిళ దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ శనివారం రాహుల్‌ భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ యాత్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల తోపాటు పార్లమెంటేరియన్లు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ముక్కల్‌ నీది మయ్యం(ఎంకెఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తదితరులు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అదీగాక కమల్‌ హాసన్‌ కూడా రాహుల్‌ తనను యాత్రలో పాల్గొనమని ఆహ్వానించారని, డిసెంబర్‌ 24న ఢిల్లీలో జరిగే భారత్‌ జోడో యాత్రోల పాల్గొంటానని చెప్పారు కూడా. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ యాత్రలో సుమారు 40 వేల నుంచి 50 వేల మంది దాక పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌ చౌదరి అన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని బదర్‌పూర్‌ సరిహద్దులోకి ప్రవేశించనున్న ఈ యాత్రలో వివిధ రంగాలకు చెందిన ప్రజలు చేరతారు. ఆపోలా ఆస్పత్రి మీదుగా వెళ్లి.. ఆ తర్వాత భోజన విరామం తీసుకుని యాత్ర తిరిగి ప్రారంభిస్తామని చౌదరి చెప్పారు.

ఆ తదనంతరం నిజాముద్దీన్‌ వైపు వెళ్లి, ఎర్రకోట వైపు వెళ్లే ముందు ఇండియా గేట్‌ సర్కిల్‌ ఐటీఓ ఢిల్లీ కాంట్‌ దర్యాగంజ్‌వైపు యాత్ర సాగనుందని వెల్లడించారు. అక్కడ రాహుల్‌, యాత్రలో పాల్గొన్న మరికొందరు నేతలు కారులో రాజ్‌ఘాట్‌, వీర్బూమి, శాంతివన్‌లను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని చెప్పారు. జనవరి 3న ఉత్తరప్రదేశ్‌ నుంచి యాత్ర పునః ప్రారంభమవుతుందని, మళ్లీ రెండోవ దశలో హర్యానాకు, ఆపై పంజాబ్‌ నుంచి కాశ్మీర్‌వైపు యాత్ర సాగనుందని వివరించారు. కాగా సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌లో పర్యటించింది.

(చదవండి: టీవీ మెకానిక్‌ కూతురు..తొలి ముస్లిం ఫైటర్‌ పైలట్‌గా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top