ఏఐసీసీ చీఫ్‌పై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు | BJP Leaders' Complaint Against Mallikarjun Kharge | Sakshi
Sakshi News home page

ఏఐసీసీ చీఫ్‌పై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు

Apr 22 2026 12:22 PM | Updated on Apr 22 2026 12:32 PM

BJP Leaders' Complaint Against Mallikarjun Kharge

ఢిల్లీ:   ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నిన్న ‍ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ చర్చలకు ఉపక్రమించింది. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్‌ విజయ్‌ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement