ఎయిమ్స్‌ వైద్య విద్యార్థి బలవన్మరణం

AIIMS Medical Student Commits Suicide From Drown Hostel Building IN New Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో దారుణం జరిగింది. వైద్య విద్యార్థి ఆత్మహత్మకు పాల్పడి ఘటన కలకలం రేపుతోంది. ఎయిమ్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న వికాస్‌ (22) అనే వైద్య విద్యార్థి సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతడు మరణించాడు. పోలీసుల సమాచారం ప్రకారం... న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో వికాస్‌ అనే వైద్య విద్యార్థి హాస్టల్ పైకప్పుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనపై తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న అనంతరం సదరు బాధితుడిని ఎయిమ్స్‌లోని సంబంధిత విభాగానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
(చదవండి: కరోనా నుంచి కోలుకున్న కర్ణాటక సీఎం)

వికాస్‌కు చికిత్స అందిస్తుండగానే అతడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు వికాస్‌ బెంగళూరుకు చెందిన వాడని, అతడు 2018 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. వికాస్‌ కొద్ది రోజులుగా మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, అతడికి మానసిక వైద్య చికిత్స వార్డులో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వికాస్ రోజులాగే ఈ రోజు కూడా విధులకు హజరయ్యాడని, సాయంత్రం సమయంలో ఒక గంట సెలవు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విరామం కోసం వెళ్లి సాయంత్రం 6 గంటల సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top