కోవిడ్‌ మరణాలపై డెత్‌ ఆడిట్‌ నిర్వహించాలి: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

AIIMS Chief: Hospitals, States Must Audit Covid Deaths To Ensure Clarity - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో సంభవించిన కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలని ఎయిమ్స్‌డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. కోవిడ్‌ మరణాల లెక్కింపు విషయంలో రాష్ట్రాలు, ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వ్యత్సాసం వల్ల కోవిడ్‌కు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆవ్యాఖ్యలు వచ్చాయి. దీనికి ఇటీవల మధ్యప్రదేశ్‌లో అధికారిక గణాంకాలు,  ఏప్రిల్‌లో నిర్వహించిన చివరి కర్మల సంఖ్య మధ్య అసమానత ఉండటమే కారణం.

ఒక వ్యక్తికి అప్పటికే కరోనా ఉండి గుండెపోటుతో చనిపోతే అప్పుడు కోవిడ్ గుండెపోటుకు కారణం కావచ్చు. మీరు దీనిని కోవిడ్ మరణమని లేదా నాన్‌ కోవిడ్‌గాగుర్తించి గుండెపోటుతో మరణించారని అని తప్పుగా వర్గీకరించవచ్చు. కాబట్టి, అన్ని ఆస్పత్రులు, రాష్ట్రాలు డెత్ ఆడిట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరణాలకు కారణాలు ఏమిటనే విషయంతోపాటు మరణ రేటును తగ్గించడానికి ఏమి చేయవచ్చో తెలుసుకునేందుకు దోహదపడుతుంది. మాకు స్పష్టమైన డేటా లేకపోతే, మేము చేయలేము మా మరణాలను తగ్గించడానికి ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేయగలగాలి.’ డాక్టర్ గులేరియా చెప్పారు. కోవిడ్‌తో లేక ఇతర కారణాలతో రోగి మరణించాడా అనే విషయాన్ని ఎవరు నిర్ణయించాలో ఇటీవల కేరళ శాసనసభ చర్చించిన క్రమంలో ఆయన ఇలా పేర్కొన్నారు.

చదవండి: COVID Vaccine: వ్యాక్సిన్‌ వేసుకున్నా కరోనా సోకిందా? 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top