Hijra Escapes With Rs.6 Crore In Yadagirigutta - Sakshi
Sakshi News home page

​​​​​​​రూ.6కోట్ల చిట్టీ డబ్బులతో ఉడాయించిన హిజ్రా

Jul 17 2023 2:00 AM | Updated on Jul 17 2023 1:46 PM

- - Sakshi

యాదగిరిగుట్ట రూరల్‌: చిట్టీ డబ్బులు రూ.6కోట్లతో ఉడాయించిన హిజ్రాను బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఓ హిజ్రా గత 25 సంవత్సరాల నుంచి ప్రజలతో మమేకమై చిట్టీల వ్యాపారం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో పట్టణానికి చెందిన సుమారు 50 మంది వ్యక్తులు సదరు హిజ్రా వద్ద చిట్టీలు వేశారు.

ఎత్తిన చిట్టీలు ఇవ్వకుండా తర్వాత ఇస్తానని చెప్పి, సుమారుగా రూ.6కోట్లతో ఎవరికీ నాలుగు రోజల క్రితం ఆమె పారిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు హిజ్రా కోసం గాలించి పట్టుకుని ఆదివారం యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. కాగా హిజ్రా ముందుజాగ్రత్తగా ఐపీ పెట్టుకుని పారిపోయిందని, ఆమె మీద కేసు చేయడానికి వీల్లేదని, ఆమెతో మాట్లాడి డబ్బులు సెటిల్‌ చేసుకోవాలని పోలీసులు బాధితులకు సలహా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement