ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

వెంకటాపురం(ఎం): మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా రామప్ప ఆలయాన్ని సుందరీకరించాలని కలెక్టర్‌ టీఎస్‌.దివాకర అధికారులకు సూచించారు. మండల పరిధిలోని రామప్పలో నిర్వహించనున్న మహాశివరాత్రి ఏర్పాట్లను కలెక్టర్‌ గురువారం పరిశీలించి మాట్లాడారు. రామప్పలో మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. రామప్పకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని వివరించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేయాలని, జాగరణ చేపట్టే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ,ఆర్డీఓ వెంకటేశ్‌, ఆలయ ఈఓ శ్రీనివాస్‌, అర్చకులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement