యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో  ‘తెలుగింటి సంస్కృతి’ | Telugu Inti Samskruthi Music Got 1 Million Views In Youtube | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో  ‘తెలుగింటి సంస్కృతి’

Oct 8 2023 4:13 PM | Updated on Oct 8 2023 5:03 PM

Telugu Inti Samskruthi Music Got 1 Million Views In Youtube - Sakshi

 ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఇంద్ర’ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రశాంతి హారతి. ఆమె కూతురు తాన్య హారతి ప్రధాన పాత్రలో నటించిన మ్యూజిక్‌ వీడియో ‘తెలుగించి సంస్కృతి’. వీఎస్‌ ఆదిత్య కాన్సెప్ట్‌ అందించిన ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. 1 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన సందర్భంగా ఇటీవల టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. తమ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవడం సంతోషంగా ఉందన్నారు. 

ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అయిన గోపాల్ పొనంగి గారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు బృందం తమ ప్రగాఢమైన అభినందనలను తెలియజేసారు.ఈ ప్రాజెక్ట్‌ను ఘన విజయంతో ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అద్భుతమైన 1M+ వీక్షకులకు బృందం వారి ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆల్బమ్‌కి ప్రశాంతి హారతి కొరియోగ్రఫీ అందించడంతో పాటు కీలక పాత్ర పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement