Rashi Khanna: నీకోసం ఏమైనా చేస్తా! | Rashi Khanna Celebrate Her Father Birthday | Sakshi
Sakshi News home page

Rashi Khanna: నీకోసం ఏమైనా చేస్తా!

Jul 23 2021 12:00 AM | Updated on Jul 23 2021 1:31 AM

Rashi Khanna Celebrate Her Father Birthday - Sakshi

రాశీ ఖన్నా

‘‘సమయం ఆగిపోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాశీ ఖన్నా. తన తండ్రి రాజ్‌ కె. ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇలా కోరుకున్నారు. అలాగే తండ్రి 60వ పుట్టినరోజుకి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ముందు చెప్పకుండా పార్టీ ఏర్పాటు చేశారు. తండ్రితో కేక్‌ కట్‌ చేయించారు. ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘నాన్నకు నచ్చినవి స్వయంగా నేనే వండాను. ఆ అందమైన నవ్వు కోసం ఏమైనా చేయొచ్చు. మా ఇంటిల్లిపాదికీ డార్లింగ్‌ ఆయన.

ఒక నిస్వార్థ సోదరుడు, మంచి కొడుకు, పరిపూర్ణమైన భర్త.. అన్నింటికీ మించి అద్భుతమైన తండ్రి. నా జీవితంలో జరిగిన అద్భుతాలన్నింటికీ ఆయనే కారణం’’ అంటూ, ‘‘నాన్నా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ సమయం ఇక్కడే ఆగిపోవాలని కోరుకుంటున్నాను. నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి నువ్వు ప్రేమను పంచినట్లుగానే ఆ దేవుడు నీ మీద ప్రేమ కురిపించాలని కోరుకుంటున్నాను. నీలాంటి మంచి తండ్రికి కూతురిని అయినందుకు గర్వంగా ఉంది. నీ కోసం ఏమైనా చేస్తాను’’ అంటూ తండ్రి మీద ఉన్న ప్రేమ మొత్తాన్ని వ్యక్తపరిచారు రాశీ ఖన్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement