‘పైలం పిలగా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | pailam pilaga movie Release Date out | Sakshi
Sakshi News home page

‘పైలం పిలగా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Sep 18 2024 7:28 PM | Updated on Sep 18 2024 7:52 PM

pailam pilaga movie Release Date out

'పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి తేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పైలం పిలగా’. పుష్ప , పరేషాన్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పావని కరణం హీరోయిన్‌గా నటించింది. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.  మంచి పాటలు,  ఎంటర్టైనింగ్ టీజర్, ఎంగేజింగ్  ట్రైలర్ ప్రేక్షుకుల దృష్టిలో పడి, సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల బాలయ్య  ఈ  'పైలం పిలగా' చిత్ర టీజర్, ట్రైలర్ ను చూసి మూవీ టీంని ప్రశంసించాడు.

(చదవండి: నా ఫోటోలు చూసి హేళన.. కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో కనిపించాక..)

పైసాను ప్రేమించే పిలగాడు, ప్రకృతిని ప్రేమించే పిల్ల. మేఘాల్లో మేడలు కట్టుకోవాలని కలలు కనే మొనగాడు, చెట్టు కింద చిన్న గూడు చాలు అనుకునే  అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ ఒకవైపు, ఎక్కడికైనా సరే,  ఎంత దూరమైనా సరే వెళ్లి కోట్లు సంపాదించి తన ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలనే ఆరాటం ఇంకోవైపు, ఈ ఈస్ట్ వెస్ట్ సంఘర్షణని వినోదాత్మకంగా తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రం 'పైలం పిలగా'అని మేకర్స్‌ తెలిపారు.


హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో  మొదటి చిత్రం 'పైలం పిలగా' ను  రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్  జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement