'మిస్‌ ఇండియా ఎర్త్‌' కిడ్నాప్‌.. భర్తపై ఫిర్యాదు | Miss India Earth Sayali Surve Missing | Sakshi
Sakshi News home page

'మిస్‌ ఇండియా ఎర్త్‌' కిడ్నాప్‌.. భర్తపై ఫిర్యాదు

Apr 7 2026 10:25 AM | Updated on Apr 7 2026 10:33 AM

Miss India Earth Sayali Surve Missing

మిస్‌ ఇండియా ఎర్త్‌ -2019 విజేతగా చెప్పుకుంటున్న సయాలీ సుర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పూణేకు చెందిన ఈమె, 2019లో వివాహం చేసుకున్న తర్వాత ఇస్లాంలోకి మారి ‘అలీజా’గా పేరు మార్చుకున్నారు. అయితే, పూణేలోని చించ్వాడ్‌లో ఉంటున్న ఆమె కనిపించడం లేదు. తన భర్త ఆతీఫ్‌ వేధించాడని, బలవంతంగా మతం మార్చాడని ఆరోపిస్తూ ఇటీవల హిందూ మతంలోకి తిరిగి మారారు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఆమె కనిపించకుండా పోవడంతో చర్చనీయాంశంగా మారింది. పూణే పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. భర్త, అత్తింటివారే సయాలీ సర్వేని కిడ్నాప్‌ చేశారని ఆరోపిస్తున్నారు.

2019లో మీరా-భయందర్‌కు చెందిన వ్యాపారవేత్త ఆతీఫ్ టాసేను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత, ఆమె ఇస్లాం మతంలోకి మారి, తన పేరును అతీజా టాసేగా మార్చుకుంది. గొడవల కారణంగా వారి వివాహ బంధం చాలా త్వరగా ముగిసిపోయింది. ఆతీఫ్ టాసేను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని ఆమె గతంలో ఆరోపించారు. అతను పెట్టిన శారీరక హింసను కేవలం తన పిల్లల కోసం భరించానని పేర్కొంది. తనతో దూరం అయిన తర్వాత ఆమె తిరిగి హిందూ మతంలోకి చేరి తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకుంది. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఆమె కిడ్నాప్‌ కావడం చర్చనీయాంశంగా మారింది.
(గమనిక: కొందరు నివేదికల ప్రకారం, 2019లో అధికారిక 'మిస్ ఎర్త్ ఇండియా' విజేతగా డాక్టర్ తేజస్విని మనోజ్ఞ ఉన్నారు. )
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement