సముద్రం వైపు స్టార్‌ హీరోలు.. విజయ తీరాలకు చేరేనా? | From Jr NTR To Naga Chaitanya, Top Tollywood Heroes Focus On Coastal Backdrop Stories - Sakshi
Sakshi News home page

సముద్రం వైపు స్టార్‌ హీరోలు.. విజయ తీరాలకు చేరేనా?

Dec 3 2023 12:38 PM | Updated on Dec 3 2023 1:45 PM

Jr NTR To Naga Chaitanya Tollywood Heroes Focus On Coastal Backdrop Stories - Sakshi

మొన్నటి వరకు అడవి బాట పట్టిన తెలుగు హీరోలు..ఇప్పుడు సముద్రం వైపు చూస్తున్నారు. తీర ప్రాంతాల నేపథ్యంలో ఉన్న కథలను ఎంచుకొని బాక్సాఫీస్‌ వేటకు రెడీ అవుతున్నారు. కోస్టల్‌ బ్యాక్‌డ్రాప్‌  రాబోతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.

దేవర

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ మూవీ నేపథ్యం సముద్ర తీర ప్రాంతం చుట్టే తిరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్‌ ప్లే చేస్తున్నట్లు టాక్‌. కోస్టల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్‌ని నిర్మించారు. హాలీవుడ్‌ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.  సైఫ్‌ అలీఖాన్‌  విలన్‌గా నటిస్తున్నాడు. 

తండేల్‌
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండేల్‌. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది.  కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతుంది. ఇందులో చైతూ మత్య్సకారుడిగా కనిపించబోతున్నాడు.

తండ్రి బాటలో రామ్‌ చరణ్‌
మెగాస్టార్‌ చిరంజీవి  కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో 'వాల్తేరు వీరయ్య' వంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసి హిట్‌ కొట్టాడు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు రామ్‌ చరణ్‌ కూడా తండ్రిని ఫాలో అవుతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో నటించబోయే సినిమా కథకి సముంద్రంతో లింక్‌ ఉంటుందని అంటున్నారు. కోస్తా బ్యాక్‌డ్రాప్‌లో స్మోర్ట్స్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు సమాచారం.

అలాగే పవన్‌ కల్యాణ్‌-సుజీత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఓజీ(OG) కథకు కూడా సముద్రంతో సంబంధం ఉంటుందట. ముంబై షిప్పింగ్ యార్డ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మొత్తానికి తెలుగు స్టార్‌ హీరోలంతా విజయం కోసం సముద్రాన్ని నమ్ముకున్నారు. మరి వీరిలో ఎవరు విజయ తీరాలకు చేరుతారో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement