ప్రియమణి గ్యాంగ్‌ 

Heroine Priyamani Will Act In New Movie Called Quotation Gang - Sakshi

ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాలా దగ్గర అసోసియేట్‌గా చేసిన వివేక్‌  కె. దర్శకత్వం వహించనున్నారు. ‘శ్రీమన్నారాయణ, మిరపకాయ్, పైసా’ వంటి సినిమాలను హిందీలో డబ్‌ చేసిన ఫిల్మీ నాటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గాయత్రీ సురేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించబోతున్నాం.

ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ చిత్రీకరణ అంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ముంబై, తమిళనాడులో ప్లాన్‌ చేశాం. ఈ సినిమాలో ఓ స్టార్‌ హీరో కీలక పాత్ర పోషించనున్నారు. ధన్యా రాఫియా బాను, వైష్ణో వారియర్, అక్షయ ఇతర పాత్రల్లో నటించనున్నారు’’ అన్నారు. కాగా ప్రియమణి ప్రస్తుతం వెంకటేష్‌ ‘నారప్ప’ చిత్రంలో సుందరమ్మగా నటిస్తున్నారు. అదే విధంగా ‘విరాటపర్వం’ సినిమాలోనూ కామ్రేడ్‌ భారతక్కగా నటనకు ఆస్కారమున్న పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్, కన్నడలోనూ ఆమె చిత్రాలు చేస్తున్నారు. ‘ద ఫ్యామిలీ మెన్‌’ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌లో, ‘ఢీ’ షోతోనూ బిజీబిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top