Dhamaka Movie Songs: రవితేజ ధమాకా నుంచి మరో మాస్ సాంగ్.. ప్రోమో అవుట్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం మరో అదిరిపోయే సాంగ్‌తో అప్‌డేట్ ఇచ్చింది.
ఈ చిత్రంలోని మరో ఫాస్ట్ బీట్ ‘దండకడియాల్’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ త్వరలోనే రానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే జింతాక్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. మరి దండకడియాల్ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది చూడాల్సి ఉంది.