బిగ్‌బాస్‌ నుంచి 'బెజవాడ బేబక్క' ఎంత సంపాదించింది..? | Bigg Boss Telugu 8 1st Evicted Bezawada Bebakka Remuneration | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ నుంచి 'బెజవాడ బేబక్క' ఎంత సంపాదించింది..?

Sep 9 2024 9:22 AM | Updated on Sep 9 2024 12:54 PM

Bigg Boss Telugu 8 1st Evicted Bezawada Bebakka Remuneration

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మొదటి వారం ఎలిమినేషన్‌ పూర్తి అయింది. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్‌గా  బెజవాడ బేబక్క నిలిచింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఆమెకు భారీగానే అభిమానులు ఉన్నారు. బిగ్‌బాస్‌ నుంచి ఆమె ఎలిమినేషన్‌ కావడంతో బేబక్క ఫ్యాన్స్‌ కాస్త నిరాశ చెందారు. బిగ్‌బాస్‌లో వారం రోజుల పాటు ఉన్న బేబక్క ఎంత సంపాదించిందని సోషల్‌ మీడియాలో లెక్కలేసుకుంటున్నారు.

నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఏడో కంటెస్ట్ంట్‌గా బెజవాడ బేబక్క అడుగుపెట్టింది. అయితే, మొదటి వారం నామినేషన్స్‌ లిస్ట్‌లో విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, శేఖర్ బాషా ఉన్నారు. వీరందిరిలో బెజవాడ బేబక్కకు తక్కువ ఓట్లు రావడంతో బిగ్‌బాస్‌ నుంచి నిష్క్రమించింది.

వారం రోజులపాటు బిగ్ బాస్‌లో ఉన్న బేబక్కకు  రెమ్యునరేషన్‌గా రూ. 1.30 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే, బిగ్‌బాస్‌ వల్ల బేబక్కకు సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్స్‌ పెరిగారు. ఆమె ఎలిమినేషన్‌ అయినా సరే ఎలాంటి నెగెటివిటీ లేకుండానే బయటకొచ్చారు. ఎప్పుడూ కిచెన్‌లో ఉన్న బేబక్క తన వంటతో హౌస్‌మేట్స్‌ కడుపునింపినా ప్రేక్షకులకు ఏమాత్రం వినోదం ఇవ్వడం లేదు. ఈ కారణంతోనే ఆమె ఎలిమినేషన్‌ అయ్యారని చెప్పవచ్చు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement