త‌న అమ్మ‌కు మ‌రో షాక్ ఇవ్వ‌నున్న లాస్య‌

Bigg Boss 4 Telugu: Harika Revels She Is In Relationship In Past - Sakshi

అఖిల్ వెళ్లిపోయాడ‌ని మోనాల్‌, సోహైల్ తెగ బాధ‌ప‌డ్డారు. కానీ మిగ‌తావాళ్లు మాత్రం అత‌డు లేడ‌న్న విష‌యాన్ని కూడా పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఇక అభిజిత్ అయితే హౌస్‌లో పెద్ద‌ తేడా ఏమీ క‌నిపించ‌ట్లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఏదేమైనా ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన అఖిల్.. ఇప్పుడు అంద‌రి ఆట‌ను ద‌గ్గ‌రుండి చూస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు వారి పాలిట మ‌రో బిగ్‌బాస్ అయి కూర్చున్నాడు. కంటెస్టెంట్ల కోసం వారి ఇంటి నుంచి లేఖ‌లు వ‌చ్చాయి. వాటిని అంద‌రికీ ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణ‌యం అఖిల్ చేతిలో ఉంది. ఎలాగో మోనాల్‌, సోహైల్ లేఖ‌ల‌ను వారికి అందించకుండా ఉండే ప్ర‌సక్తే లేదు.

వారితో పాటు హారిక‌, లాస్య, మెహ‌బూబ్‌కు కూడా లెట‌ర్స్ వ‌చ్చిన‌ట్లు తాజా ప్రోమోను చూస్తుంటే తెలుస్తోంది. కానీ కొంద‌రి లేఖ‌లు ముక్క‌లు ముక్క‌లు చేసి పంపించ‌డంతో వారు షాక్ తిన్నారు. ఎప్పుడూ త‌న ఎమోష‌న్‌ను బ్యాలెన్స్ చేసుకునే అభిజిత్‌కు అఖిల్ లేఖ పంపించ‌కోవ‌చ్చ‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆరిపోయే దీపం, నామినేష‌న్స్.. ఈ రెండూ అరియానా ధైర్యాన్ని దెబ్బ‌తీశాయి. ఈ స‌మ‌యంలో ఆమెకు ఇంటి నుంచి లెట‌ర్ వ‌స్తే ఆమె తిరిగి మామూల‌య్యేందుకు అవ‌కాశ‌ముంటుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌ ట్విస్ట్‌: సీక్రెట్ రూమ్‌లోకి అఖిల్‌!)

మ‌రోవైపు ఇంటి స‌భ్యులు ఇంత‌వ‌ర‌కు ఎవ‌రికీ చెప్ప‌ని ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. తుంట‌రి ప‌నులు చేసే సోహైల్ త‌న జీవితంలో ఓ సారి న‌కిలీ త‌ల్లిదండ్రుల‌ను మాట్లాడుకున్నాన‌ని చెప్పాడు. రెండేళ్ల క్రితం ఓ అబ్బాయితో రిలేష‌న్‌లో ఉన్నాన‌ని హారిక త‌న ప్రేమ విష‌యాన్ని భ‌య‌ప‌డుతూనే చెప్పేసింది. మొద‌టిసారి ఇండ‌స్ట్రీలో డ‌బ్బులు మోస‌పోయాన‌ని అవినాష్ త‌న కెరీర్‌లో ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను చెప్పాడు. గతాన్ని త‌వ్వుతున్న‌ అరియానా.. ఈపాటికి అలా జ‌రిగుంటే నాతోపాటు న‌లుగురు చ‌నిపోయేవాళ్లు అని చెప్పుకొచ్చింది. లాస్య.. ఈరోజు మా అమ్మ‌కు ఇంకో షాక్ ఇవ్వ‌బోతున్నానంటూ మ‌రో ర‌హ‌స్యాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌నుంది. ఇలా వారి గ‌తంలో చోటు చేసుకున్న ర‌హ‌స్యాల‌ను తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: అవినాష్‌ను వెంటాడుతున్న ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు?)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top