అందుకే భావోద్వేగానికి లోనయ్యాను: చంద్రబోస్‌ | Audience Will Make Perfume Movie A Big Hit, Says Chandra Bose - Sakshi
Sakshi News home page

Chandrabose: అందుకే భావోద్వేగానికి లోనయ్యాను

Published Sat, Nov 18 2023 2:48 AM

Audience will make Perfume movie a big hit: Chandra Bose - Sakshi

‘‘నేనిప్పటివరకు 3700 పాటలు రాశాను. ఈ రోజు నా మీద పాట రాసి, పాడారు. ఆ పాటను నాకు బహుమతిగా ఇచ్చిన ‘పర్‌ఫ్యూమ్‌’ టీమ్‌కి కృతజ్ఞతలు. నేను ఆస్కార్‌ అందుకున్న వీడియోను మళ్లీ ఇక్కడ చూడటంతో భావోద్వేగానికి లోనయ్యాను. ‘పర్‌ఫ్యూమ్‌’ పెద్ద విజయం సాధించాలి. నా భార్య సుచిత్ర ఈ చిత్రంలో ఒక పాటకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు’’ అని రచయిత చంద్రబోస్‌ అన్నారు. చేనాగ్,ప్రాచీ థాకర్‌ జంటగా జేడీ స్వామి దర్శకత్వం వహించిన చిత్రం ‘పర్‌ఫ్యూమ్‌’.

శ్రీమాన్‌ మూవీస్‌ సమర్పణలో జె. సుధాకర్, శివ .బి, రాజీవ్‌ కుమార్‌ .బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆస్కార్‌ అవార్డుగ్రహీత చంద్రబోస్‌ను యూనిట్‌ సత్కరించింది. ఈ వేడుకకి అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌. విష్ణుమూర్తి, ఐఆర్‌ఎస్‌ అధికారి మురళీమోహన్, గ్రీన్‌ హార్స్‌ కంపెనీ అధినేత ప్రవీణ్‌ రెడ్డి, ఆచార్య భట్టు రమేష్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘‘కొత్త పాయింట్‌తో రూపొందిన చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి, చేనాగ్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement