Anupama Parameswaran: పాన్‌ ఇండియా సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్‌

Anupama Parameswaran To Act With Ravi Teja In Eagle Film - Sakshi

కార్తీకేయ-2 సినిమాతో భారీ హిట్టు కొట్టిన అనుపమ పాన్‌ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ దక్కించుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో అనుపమ పరమేశ్వరన్‌కు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో నటించిన 18పేజేస్‌ చిత్రం కూడా రిలీజ్‌కు రెడీ అవుతుంది. దీంతో పాటు బటర్‌ ఫ్లై అనే చిత్రంలో కూడా నటింస్తుంది. ఇదిలా ఉండగా మరో క్రేజీ ప్రాజెక్టులో అనుపమ ఛాన్స్‌ కొట్టేసిందని టాక్‌ వినిపిస్తుంది.

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనుపమను హీరోయిన్‌గా ఎంపిక చేశారట.  ఇక ఈ చిత్రానికి ఈగల్‌ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top