ఫారెస్ట్‌కి పుష్ప | Allu Arjun Pushpa Shooting at Maredumilli Forest | Sakshi
Sakshi News home page

ఫారెస్ట్‌కి పుష్ప

Nov 10 2020 12:36 AM | Updated on Nov 10 2020 12:36 AM

Allu Arjun Pushpa Shooting at Maredumilli Forest - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘పుష్ప’. నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌. వై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. నేటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతంలోని మారేడుమిల్లి డీప్‌ ఫారెస్ట్‌లో మొదలుకానుంది. ఈ షెడ్యూల్‌లో పాల్గొనడానికి అల్లు అర్జున్, సుకుమార్‌తో పాటు ఇప్పటికే చిత్రబృందం మారేడుమిల్లికి చేరుకున్నారు.

‘‘ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రమిది. ‘అల వైకుంఠపురములో’ హిట్‌ తర్వాత అల్లు అర్జున్, ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత సుకుమార్‌ కలయికలో రూపొందనున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇతర  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాత: ముత్తంశెట్టి మీడియా, కెమెరా: మిరోస్లోవ్‌ కుబ బ్రోజెక్, సీఈఓ: చెర్రీ, లైన్‌ ప్రొడ్యూసర్‌: బాల సుబ్రమణ్యం కె.వి.వి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement