నిశ్చితార్థంతో సర్‌ప్రైజ్.. టాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి రెడీ | Actress Megha Akash Engagement With Saai Vishnu | Sakshi
Sakshi News home page

Megha Akash: ప్రియుడ్ని పరిచయం చేసిన హీరోయిన్ మేఘా ఆకాశ్

Aug 23 2024 8:25 AM | Updated on Aug 23 2024 11:55 AM

Actress Megha Akash Engagement With Saai Vishnu

యంగ్ హీరో మేఘా ఆకాశ్ నిశ్చితార్థం చేసుకుంది. మొన్నటివరకు ఈమె పెళ్లి గురించి రకరకాల గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని నిజం చేస్తూ సాయి విష్ణు అనే కుర్రాడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన మూడు ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 22న ఈ శుభకార్యం జరిగినట్లు చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)

మేఘా ఆకాశ్ విషయానికొస్తే.. చెన్నైలో పుట్టి పెరిగింది. తెలుగు హీరో నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే ఛల్ 'మోహన రంగ', 'రాజరాజ చోర', 'డియర్ మేఘ', 'గుర్తుందా శీతాకాలం', 'ప్రేమదేశం', 'రావణాసుర', 'బూ', 'మనుచరిత్ర' మూవీస్ చేసింది. తమిళంలోనూ రజనీకాంత్ 'పేటా'తో పాటు బోలెడన్ని చిత్రాల్లో నటించింది. కాకపోతే ఈమెకు సరైన బ్రేక్ రాలేదు.

గత కొన్నిరోజుల నుంచి మేఘా ఆకాశ్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో వివాహం చేసుకోనుందని అన్నారు. ఇవన్నీ అలా ఉండగానే సాయి విష్ణు అనే కుర్రాడితో ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. కాకపోతే ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ లాంటివి మాత్రం ప్రస్తుతానికి తెలియట్లేదు. ఏదేమైనా మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందనమాట. ఇదలా ఉంచితే తెలుగు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్‌ని పెళ్లి చేసుకున్నాడు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement