గ్రాఫిక్‌ డిజైనర్‌ అన్య రంగస్వామిని పెళ్లాడిన డానిష్‌ సైత్‌

Actor-Comedian Danish Sait Marries Fiancee Anya Rangaswami - Sakshi

ముంబై : ప్రముఖ నటుడు, స్టాండప్‌ కమెడియన్‌ డానిష్‌ సైత్‌ ఓ ఇంటివాడయ్యాడు. గ్రాఫిక్‌ డిజైనర్‌ అన్య రంగస్వామిని అతికొద్ది మంది బందువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కేవలం 15మంది అతిథుల సమక్షంలో సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంది ఈ జంట. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను డానిష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..నిన్న మా పెళ్లి జరిగింది. బంధులు, సన్నిహితుల సమక్షంలో అన్య, నేను రింగ్స్‌ మార్చుకున్నాం. ఎంతో ప్రేమతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మమ్మల్ని ఆశిర్శదించండి అంటూ డానిష్‌ పోస్ట్‌ చేశాడు. ఈ కొత్త జంటకు అనుష్క శర్మ, దియా మీర్జా, సునీత కపూర్‌ సహా పలువురు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

డానిష్‌ తన పెళ్లి వేడుకకు సంబంధించి పోస్ట్‌ షేర్‌ చేసిన వెంటనే డానిష్‌ సిస్టర్‌ కుబ్రా సైత్‌ గుడ్‌ విషెస్‌ అందిస్తూ కామెంట్‌ చేసింది. ఇక పెళ్లి వేడుకకు రాలేకపోయిన వారికోసం లైవ్‌ ప్రసారం చేశాడు. గతేడాది డిసెంబర్‌లో డానిష్‌-అన్య రంగస్వామిల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. డానిష్‌ సైత్‌ను ఆర్‌సీబీ జట్టు ఫన్నీ మ్యాన్‌ 'మిస్టర్‌ నాగ్స్‌' అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఆర్‌సీబీ ఆటగాళ్లకు వినోదం, ఆనందాన్ని పంచడమే మనోడి పని. ఆటగాళ్లతో ప్రాంక్స్‌ కూడా చేస్తుంటాడు. మిస్ట‌ర్ నాగ్స్‌గా పేరుగాంచిన డానిష్‌ సైత్‌.. ఆర్‌సీబీకి హెస్ట్‌, ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంటాడు.నటుడిగా, కమెడియన్‌గానే కాకుండా హోస్ట్‌గా, రచయితగానూ పనిచేశాడు. 

చదవండి : తాళి కట్టేముందు ఆ కన్నడ హీరో కాబోయే భార్యను ఏం అడిగాడంటే!
నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్‌ ఏంటంటే..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top