ఎన్నిక ప్రశాంతం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంచిర్యాల నగరపాలక సంస్థ, మిగతా నాలుగు పురపాలక సంఘాల్లో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్‌తో కలిసి ఎన్నిక ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరం లేక ప్రమాణ స్వీకారం, చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక 17వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.


