● డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ● కాంగ్రెస్‌ పార్టీకి భారీ మెజార్టీతో ఇద్దరూ ఏకగ్రీవం ● ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు హాజరు ● ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్డీవో శ్రీనివాసరావు | - | Sakshi
Sakshi News home page

● డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ● కాంగ్రెస్‌ పార్టీకి భారీ మెజార్టీతో ఇద్దరూ ఏకగ్రీవం ● ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు హాజరు ● ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్డీవో శ్రీనివాసరావు

Feb 17 2026 7:22 AM | Updated on Feb 17 2026 7:22 AM

● డిప

● డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ● కాంగ్రెస్‌ పార్టీకి భార

● డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ● కాంగ్రెస్‌ పార్టీకి భారీ మెజార్టీతో ఇద్దరూ ఏకగ్రీవం ● ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు హాజరు ● ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్డీవో శ్రీనివాసరావు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి మేయర్‌గా దర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో కాంగ్రెస్‌ పార్టీ 44 స్థానాలు గెలుచుకోవడంతో పోటీ లేకుండా పోయింది. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు కే.గంగాధర్‌, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, నగర కమిషనర్‌ అన్వేష్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. ముందుగా తెలుగు అక్షరమాల ప్రకారం 60మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. బీజేపీ తరఫున గెలిచిన ఐదుగురు కార్పొరేటర్లు 45నిమిషాలు ఆలస్యంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక చేపట్టారు. 60 డివిజన్లలో 44 స్థానాలు కాంగ్రెస్‌, 8 బీఆర్‌ఎస్‌, 5 బీజేపీ, 2 ఏఐఎఫ్‌బీ, ఒక స్థానం జనసేన పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి మెజార్టీ సాధించిన కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లకు విప్‌ జారీ చేసే అధికారాన్ని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖకు ఇవ్వగా.. ఆమె విప్‌ జారీ చేశారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు కార్పొరేషన్‌లో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు హాజరయ్యారు. అనంతరం మేయర్‌ అభ్యర్థిగా 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ దర్ని మధుకర్‌ను 14వ డివిజన్‌ కార్పొరేటర్‌ తూముల నరేష్‌ ప్రతిపాదించారు. మేయర్‌ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ కార్పొరేటర్లు సుదమల్ల హరికృష్ణ, జోగుల సదానందం, చింతపండు శ్రీనివాస్‌, గంగవరపు వెంకటేశ్వర్లు, మహ్మద్‌ ఖాలీద్‌ బలపర్చారు. అనంతరం ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో దర్ని మధుకర్‌ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించి, ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ మేయర్‌గా 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ సల్ల రమ్యను 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెంట రజిత ప్రతిపాదించగా, కార్పొరేటర్లు యశోద పుట్ట, బియ్యాల త్రివేణి, గంగవరపు వెంకటేశ్వర్లు బలపర్చారు. ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో సల్ల రమ్య కూడా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు బాణసంచా కాలుస్తూ నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

భారీ బందోబస్తు

మంచిర్యాలక్రైం: నగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 13న ఫలితాలు వెలువడిన వెంటనే శిబిరానికి తరలివెళ్లిన కార్పొరేటర్లు సోమవారం నేరుగా కార్పొరేషన్‌ కార్యాలయానికి తరలివచ్చారు. ఆయా పార్టీల నాయకులు, అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి ఏర్పడింది. కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు నిలువరించారు. డీసీపీ భాస్కర్‌ ఆధ్వర్యంలో ఏసీపీ ప్రకాశ్‌, సీఐలు ప్రమోద్‌రావు, అశోక్‌, నరేష్‌కుమార్‌, 150మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.

● డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ● కాంగ్రెస్‌ పార్టీకి భార1
1/1

● డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ● కాంగ్రెస్‌ పార్టీకి భార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement