నగర అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

నగర అభివృద్ధికి కృషి

Feb 17 2026 7:22 AM | Updated on Feb 17 2026 7:22 AM

నగర అభివృద్ధికి కృషి

నగర అభివృద్ధికి కృషి

– మంచిర్యాల మేయర్‌ దర్ని మధుకర్‌

మంచిర్యాలటౌన్‌: తనపై ఎంతగానో నమ్మకంతో 32వ డివిజన్‌ ప్రజలు గెలిపించడం వల్ల స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు మేయర్‌గా అవకాశం కల్పించారని దర్ని మధుకర్‌ అన్నారు. మేయర్‌గా ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ గతంలోనే తమ డివిజన్‌ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రూ.1.20 కోట్ల అభివృద్ధి పనులు ఇచ్చారని, ఆ అభివృద్ధితోనే తాను కార్పొరేటర్‌గా గెలిచానని అన్నారు. తన గెలుపు ఫలితం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుకే ఘనత దక్కుతుందని, మంచిర్యాల కార్పొరేషన్‌ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్పొర్పోరేషన్‌ను నంబర్‌ వన్‌గా తీర్చి దిద్దేందుకు 60 మంది కార్పొరేటర్లను కలుపుకొని, సీనియర్ల సలహాలు, సూచనలతో అభివృద్ధి చేపడతామని చెప్పారు. ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ముందుకు వెళతాం.

బయోడేటా

పేరు: దర్ని మధుకర్‌

భార్య : సుజాత, గృహిణి

చదువు : బీఏ

వృత్తి : వ్యాపారం, వ్యవసాయం

పిల్లలు : హర్షవర్ధన్‌, బ్రహ్మిణి

రాజకీయం : గతంలో సింగిల్‌ విండో

డైరక్టర్‌గా అనుభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement