తాగునీటి సమస్య లేకుండా చేస్తా
– మంచిర్యాల డిప్యూటీ మేయర్ సల్ల రమ్య
మంచిర్యాలటౌన్: కార్పొరేషన్‌లోని కొన్ని గడ్డ ప్రాంతాల్లో తాగునీటికి కొంచెం ఇబ్బందులు ఉన్నట్లుగా గుర్తించామని, వాటి పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని డిప్యూటీ మేయర్ సల్ల రమ్య అన్నారు. డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో తన భర్త సల్ల మహేశ్ కౌన్సిలర్‌గా పోటీ చేసినప్పుడు ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టానని, అప్పుడే ప్రజల సమస్యలు తెలుసుకోవడం, అభివృద్ధి చేసేందుకు ఏం చేయాలనే దానిపై స్పష్టత వచ్చిందని అన్నారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తారని, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని అన్నారు. నగరంలో ఏయే సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని, రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటివి చేపడతానని తెలిపారు.
బయోడేటా
పేరు : సల్ల రమ్య
భర్త : సల్ల మహేశ్, మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్
చదువు : బీఎస్సీ, బీఈడీ
వృత్తి : గృహిణి
పిల్లలు : జతిన్‌జై(యూకేజీ), జనిత్‌జై(ఎల్‌కేజీ)


