‘రాష్ట్రంలోనే నంబర్‌వన్ కార్పొరేషన్ చేస్తా’
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపడుతోందని, దాని ఫలితంగానే ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని, మంచిర్యాల కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యతో కలిసి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని భావించి బీఆర్‌ఎస్ నుంచి ఐదుగురు, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.


