రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుడిపేట మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికయ్యారు. ఖోఖోలో వంశీ, సాయిచరణ్, వేణు, యోగాలో సిద్ధు, మణికంఠ, ఆటియా పాటియాలో రిషివర్ధన్, విజయ్, రామకృష్ణ, పికల్ బాల్ వంశీ, సాయిచరణ్, రామకృష్ణ, రెజిలింగ్ శ్రీకాంత్, శివచరణ్‌తేజ, అభిరామ్, సాయిశ్రీకర్, స్విమ్మింగ్‌లో సాయిశ్రీకర్, కార్తీక్, సెపక్‌తక్రాలో హర్షవర్ధన్, అభిలాశ్, సంతోశ్, కార్తీక్, నితిన్, ఫెన్సింగ్‌లో హర్షిత్ ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని గచ్చీబౌలి స్టేడియంతోపాటు వనపర్తి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఎంజేపీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సేర్ శ్రీధర్ తెలిపారు.


