కార్పొరేటర్‌ కహానీ! | - | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్‌ కహానీ!

Feb 17 2026 7:22 AM | Updated on Feb 17 2026 7:22 AM

కార్పొరేటర్‌ కహానీ!

కార్పొరేటర్‌ కహానీ!

● గతంలో గెలిచినవారే మళ్లీ ఎన్నిక ● ఈసారి రిజర్వేషన్‌ అనుకూలించక కుటుంబీకులను గెలిపించిన మాజీలు ● మంచిర్యాల ఓటర్ల తీర్పు ఆసక్తికరం ● ఒకటో డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రీపతి కవిత భర్త శ్రీపతి శ్రీనివాస్‌ మాజీ కౌన్సిలర్‌. ఈ సారి రిజర్వేషన్‌ అనుకూలించక సతీమణిని బరిలో నిలిపి గెలిపించుకున్నారు. ● తొమ్మిదో డివిజన్‌ కార్పొరేటర్‌ సుర్మిల్ల సౌమ్య భర్త వేణు మాజీ కౌన్సిలర్‌. చివరి ఏడాదిలో అవిశ్వాసంలో భాగంగా మున్సిపల్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రిజర్వేషన్‌ కలిసిరాక భార్యను బరిలో నిలిపి గెలిపించుకున్నారు. ● 10వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాచకొండ గోపన్న గతంలో నస్పూర్‌ (గతంలో పంచాయతీ, మున్సిపాలిటీగా ఉండగా ఇప్పుడు కార్పొరేషన్‌) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పని చేశారు. ● 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుదమల్ల హరికృష్ణ గతంలో మూడుసార్లు కౌన్సిలర్‌గా పని చేశారు. ● 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ లగిశెట్టి రాజయ్య భార్య లక్ష్మి కార్పొరేషన్‌లో విలీనం కాకముందు సర్పంచ్‌గా పని చేశారు. ● 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాసమల్ల కవిత కార్పొరేషన్‌లో విలీనం కాకముందు నంనూర్‌ ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వర్తించారు. ● 25వ డివిజన్‌ కార్పొరేటర్‌ తోట రజిత భర్త గతంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పని చేశారు. ● 32వ డివిజన్‌ కార్పొరేటర్‌, మేయర్‌ ధరణి మధూకర్‌ గతంలో సింగిల్‌ విండో డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ● 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ పూదరి సునీత ఓసారి కౌన్సిలర్‌ కాగా, అంతకుముందు ఆమె భర్త పూ దరి ప్రభాకర్‌ కూడా కౌన్సిలర్‌గా పని చేశారు. ● 42వ డివిజన్‌ కార్పొరేటర్‌ చిందం సత్యవతి భర్త చిందం శ్రీనివాస్‌ గతంలో కౌన్సిలర్‌గా పని చేశారు. ● 48వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేములపల్లి లక్ష్మీదుర్గ కుమారుడు సంజీవ్‌ గతంలో కౌన్సిలర్‌గా పని చేశారు. ఈసారి రిజర్వేషన్‌ అనుకూలించక తల్లిని బరిలో నిలిపి గెలిపించుకున్నారు. ● 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ సల్ల రమ్య భర్త మహేశ్‌ గతంలో వైస్‌ చైర్మన్‌గా పని చేశారు. ● 55వ డివిజన్‌ కార్పొరేటర్‌ గాండ్ల సత్యమ్మ గతంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా పని చేశారు. ● 56వ డివిజన్‌ కార్పొరేటర్‌ నల్ల శంకర్‌ ఓసారి కౌన్సిలర్‌ కాగా, మరోసారి వైస్‌ చైర్మన్‌ కూడా పని చేశారు. ● 57వ డివిజన్‌ కార్పొరేటర్‌ గాజుల ముఖేశ్‌గౌడ్‌ గతంలో కౌన్సిలర్‌గా, ఫ్లోర్‌ లీడర్‌గా, మాజీ వైస్‌ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టగా తాజాగా ఫ్లోర్‌ లీడర్‌గా ఎన్నికయ్యారు. ● 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొట్ల అనిత భర్త సత్యనారాయణ మాజీ కౌన్సిలర్‌. ● 59వ డివిజన్‌ కార్పొరేటర్‌ మాదంశెట్టి సత్యనారాయణ గతంలో కౌన్సిలర్‌ కాగా, ఆయన భార్య రమాదేవి కూడా కౌన్సిలర్‌గా పని చేశారు. ● 60వ డివిజన్‌ కార్పొరేటర్‌ అఫ్రీన్‌ సుల్తానా గతంలో కౌన్సిలర్‌గా పని చేశారు.

భార్యాభర్తలను వరించిన పదవులు!

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగరంలోని గోపాల్‌వాడకు చెందిన భార్యాభర్తలకు ము ఖ్యమైన పదవులు దక్కాయి. గతంలో మంచిర్యాల మున్సిపల్‌ పరిధిలోని రెండో వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై న సల్ల మహేశ్‌ ము న్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఇటీవల మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 54వ డివి జన్‌ నుంచి ఆయన భార్య సల్ల రమ్య విజయం సాధించి డిప్యూటీ మేయర్‌గా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ముఖ్యమైన పదవులు పొందేందుకు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు కారణమని, ఆయన అభిమానిగా తమకు పదవులు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని వారు తెలిపారు.

మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా గెలుపొందిన పలువురు గతంలోనూ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు, విండో డైరెక్టర్‌ తదితర పదవులను నిర్వర్తించినవారే. అలాగే, గతంలో మున్సిపల్‌ కౌన్సిలర్లుగా పని చేసిన పలువురు ఈసారి రిజర్వేషన్‌ అనుకూలించక తమ కుటుంబీకులను బరిలో నిలిపి గెలిపించుకున్నారు. ఇలా మంచిర్యాల నగరపాలక సంస్థలో కార్పొరేటర్లుగా గెలుపొందిన చాలామందికి రాజకీయ నేపథ్యముండడం గమనార్హం. – మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement