ఆటో బోల్తా – ఒకరి మృతి
రాయదుర్గం టౌన్: మండల పరిధిలోని భూపసముద్రం వద్ద అనంతపురం ప్రధాన రహదారిపై ఆదివారం ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు చనిపోయాగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని నాయకనహట్టి పంచాయితీ పరిధిలోని మల్లూరహళ్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 14 మంది డీజల్ ఆటోలో రాయదుర్గం మండలం జుంజుంరాపల్లి గ్రామంలోని చిత్రకొండపై వెలసిన అరుడ మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయల్దేరారు. భూపసముద్రం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌కు సైడ్ ఇచ్చే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఉచ్చప్ప (50) మృతి చెందగా రమేష్ (6)కు తీవ్ర రక్తగాయాలు, సంగీత (22)కు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో చిత్రదుర్గంకు తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు.


