బ్యాంకులో రూ.4 కోట్ల బంగారం మాయం
యశవంతపుర: బెంగళూరు గిరినగర పోలీసుస్టేషన్ పరిధిలోని ఇండియన్ బ్యాంక్ శాఖలో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయమైంది. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చోరీ చేశాడని తెలిసింది. వివరాలు... కిరణ్‌కుమార్ ఈ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో మునిగితేలేవాడు. జీతం మొత్తం కాకుండా, ఖాతాదారులు కుదువపెట్టిన నగలను తీసుకెళ్లి అమ్మేసి ఆ డబ్బుతో బెట్టింగ్ ఆడేవాడు. బంగారం పెట్టిన లాకర్ కీ అసిస్టెంట్ మేనేజర్, మేజనేర్ వద్ద ఉన్నాయి. మేనేజర్ నమ్మకం కొద్దీ రెండు తాళాలను నిందితుని వద్దే ఉంచాడు. ఇంకేముందీ.. అప్పుడప్పుడు కొద్దికొద్దిగా నగలను తరలించాడు.
ఇలా బయటపడింది
జనవరి 2న కొందరు ఖాతాదారులు తాము తాకట్టు పెట్టిన నగలను విడిపించుకోవడానికి వెళ్లగా వారి బంగారం కనిపించలేదు. మేనేజర్ పరిశీలించగా 21 ప్యాకెట్లలో కొద్దికొద్దిగా నగలు లేవు. మూడు ప్యాకెట్లు పూర్తిగా ఖాళీగాఉన్నాయి. ఇలా రూ.4 కోట్ల విలువగల 2,783 గ్రాముల బంగారాన్ని కిరణ్‌కుమార్ మాయం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. నగలను నగల అంగళ్లలో తాకట్టు పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఆ డబ్బులను అన్‌లైన్ బెట్టింగ్, గుర్రపు రేసులాడి పోగొట్టినట్లు తెలిపాడు. గిరినగర పోలీసులు అతనిని అరెస్టు చేసి 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అసిస్టెంట్ మేనేజర్ చోరీల బాట
బెట్టింగ్‌లలో పోగొట్టిన వైనం


