రైతులకు 12 గంటల విద్యుత్ అందించరూ..
రాయచూరు రూరల్: వేసవిలో రైతులకు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. శనివారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ మాట్లాడారు. 2023లో కేటాయించిన ఆర్‌ఆర్ నంబర్లను కొనసాగించి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను 48 గంటల్లో పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా సీఎంకు వినతిపత్రం సమర్పించారు.
పరీక్ష పుస్తకాల పంపిణీ
రాయచూరు రూరల్ : మార్చి నెలలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని కన్నడ సాహిత్య పరిషత్ కార్యదర్శి దండెప్ప బిరాదార్ సూచించారు. తాలూకాలోని ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ హైస్కూలులో ఎంపీ ప్రకాష్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. విజన్–625ను లక్ష్యంగా పెట్టుకొని విద్యార్థుల మనోబలాన్ని పెంచి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో వీరేష్, మౌనేశ్వరి, అక్షయ్ కుమార్‌లున్నారు.
బాల్య వివాహాలను అరికట్టాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు ముందుండాలని బాలల హక్కుల రక్షణ మండలి సభ్యుడు వెంకటేష్ పేర్కొన్నారు. శనివారం జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కార్మిక శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలు, బాల కార్మిక పద్ధతి నియంత్రణ, పోక్సో చట్టాలపై సమాచారం తెలిసిన వెంటనే మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు స్పందించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ కుమారస్వామి, సుదర్శన్, సునీత, మంజుల హెగ్డేలున్నారు.
అమర యోధుల సంస్మరణ ర్యాలీ
రాయచూరు రూరల్: పుల్వామా దాడి బాధితుల సంస్మరణ ర్యాలీని నగరంలో మాజీ సైనికులు చేపట్టారు. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన పారా మిలిటరీ వీర యోధుల సంస్మరణ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్ నుంచి బసవేశ్వర సర్కిల్ వరకు ర్యాలీ జరిపారు.
హెళవ సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన సందర్భంలో హెళవ సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సమాజం డిమాండ్ చేసింది. శనివారం బెంగళూరులోని విధానసౌధ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు. హెళవ సమాజం సాంఘీకంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా పరంగా వెనుకబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం సమర్పించారు.
ఉత్సవాలకు పోటెత్తిన జనం
● ట్రాఫిక్‌లో చిక్కుకొన్న బిగ్‌బాస్ గిల్లి, కావ్య
హొసపేటె: హంపీ ఉత్సవాల నేపథ్యంలో శనివారం రెండో రోజు అంచనాలకు మించి ప్రజలు, వాహనాలు తరలి రావడంతో సాయంత్రం కార్యక్రమానికి వస్తున్న బిగ్‌బాస్ విజేత గిల్లి, కావ్య ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కడ్డిరాంపుర నుంచి ప్రధాన వేదిక వరకు ట్రాఫిక్ పెరగడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడానికి నానాయాతన పడ్డారు. సుమారు 5 కి.మీ. మేర వాహనాలు గంటల తరబడి రోడ్డులో నిలిచి పోయాయి.
రైతులకు 12 గంటల విద్యుత్ అందించరూ..
రైతులకు 12 గంటల విద్యుత్ అందించరూ..
రైతులకు 12 గంటల విద్యుత్ అందించరూ..
రైతులకు 12 గంటల విద్యుత్ అందించరూ..
రైతులకు 12 గంటల విద్యుత్ అందించరూ..


