ఆకట్టుకున్న కుస్తీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

Feb 15 2026 6:52 AM | Updated on Feb 15 2026 6:52 AM

ఆకట్ట

ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం కుస్తీ పోటీలు హొసపేటె మలపనగుడి విద్యారణ్య పాఠశాల మైదానంలో పోటాపోటీగా జరిగాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో కుస్తీ పోటీలకు విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. నాటి కుస్తీ పోటీల జ్ఞాపకాలు తిరిగి తెచ్చేలా ప్రతి ఏటా హంపీ ఉత్సవాల్లో కుస్తీ పోటీలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. కుస్తీ పోటీల్లో గెలుపొందిన విజేతకు మొదటి బహుమతిగా రూ.10 వేల నగదు, రెండో బహుమతి విజేతకు రూ.5 వేల నగదు, మూడో బహుమతి విజేతకు రూ.3 వేల నగదు చొప్పున జిల్లా యంత్రాంగం అందజేస్తుంది. అదే విధంగా గుండు ఎత్తే పోటీలు, ఎద్దుల బండి చక్రాలు తొలగించి తిరిగి చక్రాలను అమర్చే పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆకట్టుకున్న కుస్తీ పోటీలు1
1/2

ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

ఆకట్టుకున్న కుస్తీ పోటీలు2
2/2

ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement