సౌండ్ అండ్ లైట్.. ఉత్సవాలకే హైలైట్
హొసపేటె: హంపీ ఉత్సవంలో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హక్కబుక్క వేదికపై ప్రదర్శించిన సౌండ్ అండ్ లైట్ కార్యక్రమం శ్రోతలను, ప్రేక్షకులను ఉత్తేజ పరిచింది. కనువిందు చేసే దృశ్యాలు, శ్రావ్యమైన సంగీతం, రంగురంగుల దుస్తులు, ఆకర్షణీయమైన లైటింగ్‌తో రూపొందించిన ధ్వని, వెలుతురు కార్యక్రమం ప్రేక్షకులను అబ్బురపరిచింది. కార్యక్రమంలో బెంగళూరు, ఢిల్లీ, పూనె తదితర చోట్ల నుంచి 110 మంది కళాకారులు, అనేక బృందాలు విజయనగర వైభవాన్ని పునఃసృష్టించాయి. ఈ కార్యక్రమం ఈనెల 19 వరకు హంపీలోని గజశాల ప్రాంగణంలో ప్రదర్శిస్తారు. మైసూరు కొరియోగ్రాఫర్ డాక్టర్ షీలా శ్రీధర్, న్యూఢిల్లీ సీబీసీ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్ సంతోష్ ఆశిష్, కొప్పళ డైట్ సీనియర్ లెక్చరర్ డి.జోషి, బెంగళూరు సీబీసీ డైరెక్టర్ జీ.విజయ్‌కుమార్, అసిస్టెంట్ వి.గంగాధర్ పాల్గొన్నారు.
సౌండ్ అండ్ లైట్.. ఉత్సవాలకే హైలైట్
సౌండ్ అండ్ లైట్.. ఉత్సవాలకే హైలైట్


