మహాశివరాత్రికి ఆలయాలు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రికి ఆలయాలు సిద్ధం

Feb 15 2026 6:52 AM | Updated on Feb 15 2026 6:52 AM

మహాశి

మహాశివరాత్రికి ఆలయాలు సిద్ధం

రాయచూరు రూరల్‌: జిల్లాలో ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. శివ నామస్మరణతో మారు మోగడానికి ఆలయ అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని మహాబళేశ్వర చౌక్‌లో చంద్రమౌళేశ్వర దేవాలయం, నగరేశ్వర, వీరభద్ర దేవస్థానం, ఐబీ రోడ్డులోని నందీశ్వరాలయం, రామలింగేశ్వర దేవాలయాల్లో భక్తులు పూజలకు సన్నద్ధంగా ఉన్నారు. శివాలయాల్లో శివస్తోత్రం, కుంభాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహిస్తారు. యక్లాసపుర బసవేశ్వర ఆలయంలో బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాలను ఊరేగిస్తారు. కాగా నగరంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి. మూడు రోజుల క్రితం ఉన్న ధరలు నేడు అమాంతం పెరిగాయి. రూ.30 ఉన్న కళింగర పండు ధర రూ.70 నుంచి రూ.100, కర్బూజ పండు ధర రూ.25 నుంచి రూ.50కి పెంచారు. ద్రాక్ష కిలో ధర రూ.120 ఉండగా నేడు రూ.250 గా నిర్ణయించారు.

శివాలయాలకు ప్రత్యేక అలంకరణలు

భారీగా పెరిగిన పూజ సామగ్రి ధరలు

మహాశివరాత్రికి ఆలయాలు సిద్ధం1
1/1

మహాశివరాత్రికి ఆలయాలు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement