కనువిందుగా సాంస్కృతిక కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

కనువిందుగా సాంస్కృతిక కార్యక్రమాలు

Feb 15 2026 6:52 AM | Updated on Feb 15 2026 6:52 AM

కనువి

కనువిందుగా సాంస్కృతిక కార్యక్రమాలు

హొసపేటె: హంపీ ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి ఎంపీ ప్రకాష్‌ వేదికపై సహన బృందం సంగీత కార్యక్రమం, సవిత అమరేష్‌ ఆధ్వర్యంలో దసరా మంగళవాయిద్యం మ్యూజిక్‌ ఫ్యూజన్‌ తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. న్యూఢిల్లీకి చెందిన ప్రతిభా ప్రహ్లాద్‌ బృందం భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. సుమారు గంట పాటు సాగిన భరత నాట్యానికి సందర్శకులు తన్మయత్వం చెందారు.

సుమధురంగా సంగీత ప్రదర్శనలు

తొలి రోజు శుక్రవారం రాత్రి కృష్ణదేవరాయ(ఎదురు బసవణ్ణ) వేదికలో వివిధ సాంస్కృతిక బృందాల నుంచి వెలువడిన సంగీత ధ్వనులు శ్రోతలను మైమరిపించాయి. యలబుర్గాకు చెందిన హనుమప్ప దసరా బృందం గీతాన్ని ఆలపించి జానపద లోకాన్ని సృష్టించారు. శివ తాండవ గీతానికి ఉత్కంఠభరితమైన భరతనాట్య ప్రదర్శన చేశారు. హావేరికి చెందిన గడగయ్య హిరేమఠ బృందం ఉదో ఎల్లమ్మ అనే పాటను ఆలపించి జోగతి నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో హిందుస్తానీ సంగీతం, శాసీ్త్రయ సంగీత ప్రదర్శనలు అలరించాయి.

కనువిందుగా సాంస్కృతిక కార్యక్రమాలు1
1/1

కనువిందుగా సాంస్కృతిక కార్యక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement