రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
రాయచూరు రూరల్: వంతెన రక్షణ గోడను క్రూసర్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం సాయంత్రం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద చోటు చేసుకుంది. యాదగిరి జిల్లా శహాపుర తాలూకా గోగికి చెందిన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున స్వామి దర్శనం కోసం క్రూసర్ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో రామరెడ్డి(52), భార్య మేఘన(50), మహదేవప్ప(65) అక్కడికక్కడే మరణించారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జడ్చర్ల వద్ద రక్షణ గోడకు క్రూసర్ ఢీ
మృతులు యాదగిరి జిల్లా వాసులు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం


