రైతన్నా.. జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

రైతన్నా.. జాగ్రత్త

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

రైతన్నా.. జాగ్రత్త నిరంతరం తనిఖీలు

5.59 లక్షల ఎకరాల్లో పంటల సాగు..

ఎల్లారెడ్డిలోని విత్తనాల దుకాణంలో రైతులు

కామారెడ్డి క్రైం: ఖరీఫ్‌ పంటల సాగుకు సమాయత్తమవుతున్న రైతన్నలు విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎరువులు, విత్తనాలను సమకూర్చుకోవడంలో బిజీగా ఉన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తిప్పలు తప్పవు. ప్రతి సీజన్‌లో నకిలీ విత్తనాల బెడద కనిపిస్తూనే ఉంది. నకిలీ, నాసిరకం విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకోవాలని కొమ్ముకాసే కంపెనీలు అనేకం మార్కెట్‌లో ఉన్నాయి. తక్కువ ధర, అధిక దిగుబడి అంటూ మాయమాటలతో రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో ప్రతి యేటా చాలాచోట్ల వెలుగుచూస్తున్నాయి. మొలకదశ నుంచి దిగుబడి వచ్చే వరకు అన్నీ సక్రమంగా జరగాలంటే నాణ్యమైన విత్తనాన్ని రైతులు ఎంచుకోవాల్సి ఉంటుంది.

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. జిల్లాలోని అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాలను నిరంతరంగా తనిఖీ చేస్తున్నాం. మండలాల పరిధిలో కూడా క్రమం తప్పకుండా దుకాణాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా నకిలీ వితనాలు విక్రయిస్తే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలి. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవు.

– మోహన్‌రెడ్డి, డీఏవో, కామారెడ్డి

జిల్లాలో ప్రధానంగా వరి సాగవుతుండగా, మొక్కజొన్న, సోయాబీన్‌, పత్తి, కంది, మిరప, కూరగాయల పంటలను సైతం చాలా మంది రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5.59 లక్షల ఎకరాల్లో వివధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు కానుంది. అలాగే 54 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 42.8 వేల ఎకరాల్లో పత్తి, 45 వేల ఎకరాల్లో కంది, 90 వేల ఎకరాల్లో సోయాబీన్‌, మరో 5 వేల ఎకరాల్లో మిరప, కూరగాయలు సాగవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే రైతులు మొక్కజొన్న, కంది, పత్తి, మిరప, కూరగాయల విత్తనాల కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు జిల్లా మార్కెట్‌లోకి వస్తుంటాయి. పక్కనే ఉన్న నిర్మల్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన ఘటనలు ప్రతి సీజన్‌లోనూ వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో కూడా చాప కింద నీరులా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి చాలా మంది రైతులు నష్టపోయారు. ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో కంపెనీల ప్రతినిధులు రావడం, రైతులను బతిమాలుకుని, ఎంతో కొంత ముట్టజెప్పి విషయం పెద్దది కాకుండా, పైస్థాయి వరకు ఫిర్యాదులు వెళ్లకుండా జాగ్రత్త పడుతన్న ఘటనలే ఎక్కువ.

పంటలసాగు కాలం ప్రారంభమైన నేపథ్యంలో ‘నకిలీ’ ముప్పు పొంచి ఉంది. విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు ఒకటికి రెండుసా ర్లు ఆలోచించి విత్తనాలు కొనుగోలు చేయాలి.

విత్తనాల కొనుగోలులో ఆగం కావొద్దు

మార్కెట్‌లో నకిలీ, నాసిరకం

విత్తనాల బెడద

మోసపూరిత కంపెనీల

సరుకు చొచ్చుకొచ్చే ముప్పు

గతంలో వెలుగు చూసిన అనేక ఘటనలు

రంగంలోకి ప్రత్యేక బృందాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement