విద్యార్థులకు అభినందన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అభినందన

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

విద్యార్థులకు అభినందన కేరళ దంపతులకు బాలిక దత్తత ‘పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా’ మాక్‌ అసెంబ్లీలో జంగంపల్లి విద్యార్థిని

బాన్సువాడ : రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం అభినందించారు. ఇంటర్మీడియెట్‌ ఇంఫ్రూవ్‌మెంట్‌ రాసిన శ్రీవైష్ణవి (ఎంపీసీ) 468/470, నిధాతహరీమ్‌(బైపీసీ) 434/440 మార్కులు సాధించారు. పట్టణంలోని తన నివాసంలో విద్యార్థులను పోచారం అభినందించి సన్మానించారు. జిల్లా నోడల్‌ అధికారి సలాం, డీఎస్పీ విఠల్‌రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ ఆర్‌ఎం

నిజామాబాద్‌ రూరల్‌ : టీజీఎస్‌ ఆర్టీసీ నిజా మాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌గా ఎస్‌వీజీకే మూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించా రు. ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ మధుసూదన్‌, డిపో మేనేజర్లు, కార్యాల య అధికారులు ఆర్‌ఎంకు స్వాగతం పలికా రు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌, డిపో మేనేజర్లు, సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు.

కామారెడ్డి క్రైం: ఆన్‌లైన్‌లో జరిగే అంతర్రాష్ట్ర దత్తత ప్రక్రియ ద్వారా కామారెడ్డి బాలసదనంకు చెందిన ఓ బాలికను కేరళ రాష్ట్రానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. గురువారం కలెక్టరేట్‌కు వచ్చిన కేరళ దంపతులకు చిన్నారి శాంతను దత్తత ఇచ్చారు. దత్తత అనంతరం చిన్నారికి అద్వికా పీఎస్‌ అనే కొత్త పేరు పెట్టారు. చిన్నారి సంక్షేమం, భవిష్యత్‌ అభివృద్ధి, కుటుంబ వాతావరణంలో పెరిగే అవకాశాన్ని కల్పించే ఉద్ధేశంతో చట్టబద్ధమైన అన్ని నిబంధనలను అనుసరించి దత్తత ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ వారికి దత్తత పత్రాలను అందజేశారు.

కామారెడ్డి టౌన్‌ : తాను ఎల్లప్పుడూ పార్టీ క్రమశిక్షణకు, అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. ఇటీవల తనకు అందిన షోకాజ్‌ నోటీసులకు స్పందిస్తూ.. క్రమశిక్షణ సంఘం వైస్‌ చైర్మన్‌ శ్యామ్‌మోహన్‌కు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.

భిక్కనూరు: సెర్ప్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నైతిని పాల్గొన్నది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న నైతిని మాక్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ మద్యపాన నిషేధంపై మాట్లాడింది. మద్యం కారణంగా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ ఆమెను అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement