ఎల్లారెడ్డి: రైతులకు విత్తనాలను విక్రయించే వారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, సీడ్ యాక్ట్–1966, సీడ్ కంట్రోల్ ఆర్డర్–1983తోపాటు ఆయా రాష్ట్రాల నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
● దుకాణాల్లో వ్యవసాయశాఖ ద్వారా పొందిన లైసెన్స్ ఉండాలి.
● విత్తనాలు కొనుగోలు చేసిన రతైఉలకు బిల్లు లేదా ఇన్వాయిస్ ఇవ్వాలి.
● రసీదులో కంపెనీ పేరు, విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ(ఎక్స్‌పైరీ డేట్), ధర స్పష్టంగా ఉండాలి.
● విత్తన ప్యాకెట్లపై కనీస మొలకెత్తే శాతం (జెర్మినేషన్ పర్సంటేజ్) భౌతిక స్వచ్ఛత వివరాలు ముద్రించి ఉండాలి.
● గడువు ముగిసిన విత్తనాలను విక్రయించొద్దు. వాటిని విడిగా భద్రపర్చాలి.
● విత్తనాలను ఎమ్మార్పీ ధరల కన్నా ఎక్కువకు విక్రయించొద్దు. దుకాణంలో ధరల పట్టిక కచ్చితంగా ఉండాలి.
● కొనుగోలు, విక్రయాలకు సంబంధించి రికార్డులను, స్టాక్ రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించాలి. వ్యవసాయ అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు వీటిని చూపించాలి.
● నాసిరకం లేదా నకిలీ విత్తనాలు విక్రయించిన వారి లైసెన్స్‌ను రద్దు చేయడంతోపాటు క్రిమినల్ కేసులు, పీడీ యాక్ట్ నమోదు చేస్తారు.
● ప్రభుత్వం నిషేధించిన హెటీ పత్తి విత్తనాల విక్రయించొద్దు.
● గింజల్లో తేమ లేకుండా సరైన గిడ్డంగుల్లోనే నిల్వ ఉంచాలి.
● తప్పుడు క్లెయిమ్‌లు, లేబుళ్లు, డూప్లికేట్ బ్రాండ్ల విత్తనాలను విక్రయించొద్దు.
● విత్తనాలు మొలకెత్తక పోతే రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను నమోదు చేయాలి. అందుకు వారికి సహకరించాలి.


