ఈనెల 15 నుంచి ‘అమ్మమాట – అంగన్‌వాడీ బాట’ | - | Sakshi
Sakshi News home page

ఈనెల 15 నుంచి ‘అమ్మమాట – అంగన్‌వాడీ బాట’

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

ఈనెల 15 నుంచి ‘అమ్మమాట – అంగన్‌వాడీ బాట’

ప్రతి సెంటర్‌ పరిధిలో

జిల్లాలో 1,193 అంగన్‌వాడీ సెంటర్లు

ఆరేళ్ల లోపు చిన్నారులు

70 వేల 149 మంది..

ఎల్లారెడ్డి రూరల్‌: జిల్లాలో ఆరేళ్లలోపు చిన్నారులను గుర్తించి వారిని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చేందుకు ఈనెల 15 నుంచి ‘అమ్మ మాట – అంగన్‌వాడీ బాట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఆటపాటలతో కూడిన విద్యను అందించనున్నారు. పిల్లలను అంగన్‌వాడీ సెంటర్లకు పంపించేలా అవగాహనక కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే 6 ఏళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తారు.

జిల్లాలో 1193 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటి పరిధిలో ఎల్లారెడ్డి, కామారెడ్డి, దోమకొండ, బాన్సు వాడ, మద్నూర్‌లలో ప్రాజెక్టు సెంటర్లు ఉన్నాయి. అంగన్‌వాడీ సెంటర్ల పరిధిలో 7,630 మంది గర్భిణు లు, 4,165 మంది బాలింతలు ఉండగా, 0 నుంచి 6 నెలల లోపు చిన్నారులు 4,618 మంది, 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 30,625 మంది, 3 నుంచి 6ఏళ్లలోపు చిన్నారులు 34,906 మంది ఉన్నారు.

పౌష్టికాహారం

అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారులకు ఉదయం పాలు, ఉడికించిన గుడ్డుతోపాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం వేళ స్నాక్స్‌లో అందిస్తారు. చిన్నారులకు సెంటర్లలో పౌష్టికాహారంతోపాటు వయస్సుకు తగిన విధంగా ఆటపాటలతో కూడిన విద్య అందుతుంది.

జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌ పరిధిలో ఈనెల 15 నుంచి ‘అమ్మమాట – అంగన్‌వాడి బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. అలాగే ఆరేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు.

– ప్రసన్న, జిల్లా సంక్షేమ అధికారిణి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement